ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖలో అకాడమీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. విశాఖపట్నం పెదగదిలి కూడలి వద్ద పీవీ సింధుకు ప్రభుత్వం మూడు ఎకరాల భూమి కేటాయించిన సంగతి తెలిసిందే. 24 మాసాల్లో అకాడమీ సిద్దం అవుతుందని ఆమె తెలిపారు. యువతకు శిక్షణ ఇచ్చి వారిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా అకాడమీ పనిచేస్తుందని ఆమె తెలిపారు.
రెండు సంవత్సరాల్లో అకాడమీ సిద్దం అవుతుందని, ఎంత మందికి శిక్షణ ఇవ్వగలమనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని పీవీ సింధు చెప్పారు.అంతర్జాతీయ స్థాయిలో అకాడమీని తీర్చుదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు. అకాడమీ నిర్మాణాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు.