ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మి పథకం అమలుతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది.
ఆర్థిక ఇబ్బందులు కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పీఎం- విద్యాలక్ష్మి పథకం అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేయనున్నారు.
దాదాపు 860 ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు రుణసాయం కూడా కల్పించనుంది. ఏడున్నర లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించడంతో పాటు 75 శాతం క్రెడిట్ గ్యారెంటీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ. 10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ ఆపరేషన్ సామర్థ్యం పెంచుకునేందుకు గాను నిధులు పెంచింది.