ఇటీవల ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 36మంది హిందూ భక్తులను అపహాస్యం చేస్తూ మహమ్మద్ అమీర్ రెహమాన్ అనే ముస్లిం వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆ పైశాచిక ఆనందంపై స్థానిక హిందువుల ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసారు.
సోమవారం ఉదయం హిందూ భక్తులు ప్రయాణిస్తున్న బస్సు ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లా మార్చూలా సమీపంలోని కూపీ గ్రామం దగ్గర పడిపోయింది. ఆ దుర్ఘటనలో 36మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 27మంది గాయపడ్డారు.
ఆ ప్రమాదానికి సంబంధించిన చిత్రాన్ని రెహమాన్ తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసాడు. దానిమీద ‘హ్యాపీ దివాలీ’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దానికి నేపథ్య గీతంగా ఒక సినిమాలోని ప్రఖ్యాత దీపావళి పాటను కూడా పెట్టాడు. ఒక పక్క ప్రాణాలు పోయి వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉంటే, వారి ప్రాణాలను అపహాస్యం చేస్తూ, వారి పండుగను అవమానిస్తూ పోస్ట్ పెట్టడం విమర్శలకు దారితీసింది.
రెహమాన్ ఫేస్బుక్ పోస్ట్‌తో మండిపడిన స్థానిక హిందువులు అతని మీద ఫిర్యాదు చేసారు. రెహమాన్ ఉద్దేశపూర్వకంగానే హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కోసమే అలాంటి పోస్ట్ చేసాడని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘ఇంతమంది మనుషులు చనిపోయారు. వారికి కనీసం అంత్యక్రియలు చేసుకోలేకపోయామని బాధ పడుతున్నాము. అలాంటి సమయంలో మహమ్మద్ రెహమాన్ ప్రమాద దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హిందూ యాత్రికుల మరణాన్ని వేడుక జరుపుకున్నాడు. ఆ చిత్రం మీద ‘దీపావళి శుభాకాంక్షలు’ అని రాసాడు. అతని చర్య మా భావోద్వేగాలను గాయపరిచింది. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి అవమానకరమైన పోస్ట్ పెట్టే సంఘటన జరగడం ఇదే మొదటిసారి. రెహమాన్‌ను కఠినంగా శిక్షించాల్సిందే. లేనిపక్షంలో ఆందోళన చేపడతాం’’ అంటూ ఫిర్యాదు చేసారు. రెహమాన్ ఒక ప్రైవేటు భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఉన్నాడనీ, ఆ నివాసాన్ని తక్షణం కూల్చివేయాలనీ కూడా వారు ఫిర్యాదు చేసారు. మరోవైపు స్థానిక బజరంగ్దళ్ విభాగం కూడా, రెహమాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు లేఖ రాసింది.
నిందితుడు ఉత్తరాఖండ్‌లోని రాంనగర్ ప్రాంతానికి చెందినవాడు, కొంతకాలంగా పౌడీ జిల్లాలో నివసిస్తున్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసారు.