ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా(72) కన్నుమూశారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. శారదా సిన్హా ఆరోగ్యం ఇటీవల అకస్మాత్తుగా క్షీణించింది. వెంటనే ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ పై ఉంచి సపోర్టు పై ఉంచి చికిత్స అందించారు . అయినా ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో కన్నుమూశారు.
బిహార్‌కు చెందిన శారదా సిన్హాను ‘స్వర కోకిల’ అని పిలుస్తారు.శారదా సిన్హా భర్త బ్రెయిన్ హెమరేజ్‌తో ఇటీవలే ప్రాణాలు విడిచారు. శారదా సిన్హా 1952 అక్టోబర్ 1న బిహార్‌లోని సుపాల్ జిల్లాలోని హులాస్‌లో జన్మించారు. సంగీతంలో ఎంఏ చేశారు. ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు.
శారదా సిన్హా మృతిపై సోషల్ మీడియాలో ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సుప్రసిద్ధ జానపద గాయని శారదా సిన్హా మృతి వార్తతో తాను చాలా బాధపడ్డానని తెలిపారు. శారదా మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని తెలిపారు.