మధ్యప్రదేశ్‌లో ఒక ముస్లిం యువకుడు ఆదివారం (3-11-2024) నాడు ఒక గణపతి ఆలయంలోకి చొరబడ్డాడు. వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసాడు. అడ్డొచ్చిన మహిళను చంపేస్తానని బెదిరించాడు. ఆ దుండగుణ్ణి స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. అతన్ని అరెస్ట్ చేసి, కేసు విచారణ ప్రారంభించారు.
ప్రత్యక్ష ప్రాక్షుల కథనం ప్రకారం… మహమ్మద్ తౌఫీక్ అనే యువకుడు ఛింద్వారా జిల్లా జున్నార్‌దేవ్ ప్రాంతంలోని గణపతి ఆలయంలోకి గతరాత్రి సుమారు 10.30 గంటల సమయంలో వెళ్ళాడు. అక్కడ వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయసాగాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఒక మహిళ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే తౌఫీక్ ఆమెను చంపేస్తానని బెదిరించాడు. అతను గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేస్తుండగా ఆ హిందూ మహిళ తట్టుకోలేక బిగ్గరగా అరిచారు. దాంతో స్థానికులైన హిందువులు అక్కడికి చేరుకున్నారు. నిందితుణ్ణి చితకబాది, పోలీసులకు అప్పగించారు.
ఆ సంఘటన వెలుగు చూసాక హిందూ సంస్థలు పోలీస్ స్టేషన్ ఎదుట భారీ బహిరంగ ప్రదర్శన నిర్వహించాయి. ఏఎస్పీ అవధేష్ ప్రతాప్ సింగ్, డిఎస్‌పి ఇన్‌ఛార్జ్ రాజేష్ కుమార్ బంజారాలు జున్నార్‌దేవ్ పీఎస్ వద్ద చేరుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు మహమ్మద్ తౌఫీక్, మరో యువకుడు కలిసి వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసారని పోలీసులు నిర్ధారించారు. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసామని వెల్లడించారు.