యూపీ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గతంలో ఈ చట్టం రాజ్యాంగ విరుద్దమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ చట్టం లౌకికవాద భావనకు విరుద్దమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని స్పష్టం చేసింది. ఈ చట్టం 10 వేల మదర్సాలు, 17 లక్షల విద్యార్థులపై ప్రభావం చూపుతుందని గతంలో అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.