బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కృష్ణ జింకలను వేటాడినట్లు ఎదుర్కొంటున్న ఆరోపణల విషయంలో ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ వరుసగా హెచ్చరికలు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.
కృష్ణ జింకలను వేటాడినందుకు క్షమాపణలు చెప్పడంతో పాటు రూ. 5 కోట్లు చెల్లించాలని తాజాగా సందేశం పంపారు.ముంబై పోలీసు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గత రాత్రి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో వాట్సప్‌లో బెదిరింపు సందేశం పంపారు.
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు పేరిట ఈ మెసేజ్ పంపారు. నటుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే తమ ఆలయానికి వెళ్ళి క్షమాపణలు కోరాలన్నారు. లేదంటే రూ.5 కోట్లు చెల్లించాలని కోరారు. అలా చేయకపోతే హతమారుస్తామని సందేశంలో పేర్కొన్నారు.
సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. గత నెల 30న కూడా ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఇదే విధమైన బెదిరింపు సందేశం అందింది. అయితే ఆ హెచ్చరిక సందర్భంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు.