ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఎపి-టిఇటి) 2024 పరీక్షల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ టెట్ 2024 ఫలితాలను విడుదల చేసారు.
టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21 వరకూ జరిగాయి. ముందు ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించారు. అక్టోబర్ 29న ఫైనల్ కీ విడుదల చేసారు. చివరికి ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు.
అభ్యర్ధులు తమ ఫలితాలను https://aptet.apcfss.in/CandidateLogin.do వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అభ్యర్ధి ఐడీ, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి తమ మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు.
టెట్ 2024 పరీక్షకు 427,300మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 368,661మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 187,256మంది పాస్ అయ్యారు.
ఫలితాలపై సందేహాలుంటే హెల్ప్ డెస్క్ నెంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు సూచించారు.
హెల్ప్ డెస్క్ నంబర్లు : 9398810958, 6281704160, 8121947387, 8125046997, 9398822554