ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్‌కాల్ చేసినది మహారాష్ట్రకు చెందిన యువతిగా గుర్తించారు. ముంబై థానే ప్రాంతంలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన 24ఏళ్ళ ఫాతిమా ఖాన్‌ను అరెస్ట్ చేసారు.
ఏ రాష్ట్రంలోనైనా హిందువులపై దాడులు చేసే ఇతర మతస్తుల విషయంలో చెప్పే కథలే ఫాతిమా ఖాన్ విషయంలోనూ పోలీసులు చెప్పారు. ఫాతిమా మనస్థిమితం లేని వ్యక్తి అని చెబుతున్నారు. ఆమె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ చేసింది.
ముంబై పోలీసులకు శనివారం నవంబర్ 2న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, గోరఖ్‌నాథ్ ఆలయం మహంత్ అయిన యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామన్నది ఆ కాల్ సారాంశం. యోగి ఆదిత్యనాథ్ పదిరోజుల్లోగా తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్దికీకి పట్టిన గతే తనకూ పడుతుందని ఆ కాల్ చేసిన వ్యక్తి చెప్పారు.
ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్ ఆ కాల్‌ను గుర్తు తెలియని నెంబర్ నుంచి రిసీవ్ చేసుకుంది. దానిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఫాతిమా ఖాన్‌ను అరెస్ట్ చేసారు.
అక్టోబర్ 12న మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సిపి అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకుడు బాబా సిద్దికీని ముగ్గురు దుండగులు ముంబైలో కాల్చి చంపేసారు. వారు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌కు చెందినవారని భావిస్తున్నారు.