ఇండినేషియాలో మరో అగ్నిపర్వతం బద్దలైంది. ఫార్స్ దీవిలోని మౌంట్ లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం నిప్పులు చిమ్ముతోంది. 2 వేల మీటర్ల ఎత్తు వరకు వేడి బూడిద వెదజల్లుతోంది. మంటలకు సమీపంలోని ఇళ్లు తగలబడిపోతున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. లకిలకి అగ్నిపర్వతం సమీపంలోని వందలాది గ్రామాలను ప్రజలు ఖాళీ చేశారు. ఇప్పటికీ దీని ప్రభావంతో 9 మంది చనిపోయారు.
ఈ ఏడాదిలోనే హెల్మెహెలా ద్వీపంలో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 60 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఇండోనేషియాలో అగ్నిపర్వతాలు వరుసగా బద్దలవడంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు.
తాజాగా లకిలకి అగ్నిపర్వతం పేలుడు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు ప్రకటించారు. అత్యంత ప్రమాద హెచ్చరికల ప్రమాణాలను ఇది దాటిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అగ్నిపర్వతం ప్రభావం 50 కి.మీ వరకు ఉంటుందని వారు అంచనా వేశారు. దాదాపు 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.