కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కెనడా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో భక్తులపై ఖలిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. దాడి వీడియోలు వైరల్ అయ్యాయి. హిందూ భక్తులపై దాడిని ప్రధాని ట్రూడో ఖండించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
హిందూ భక్తులపై దాడులను ప్రతిపక్షాలు తీవ్రగా ఖండించాయి.తాము అధికారంలోకి వచ్చాక ఇలాంటి దాడులకు స్థానం ఉండదని కన్జర్వేటివ్ పార్టీ నేత పియర్రే పొయిలీవ్రే
స్పష్టం చేశారు. కెనడా తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఎంపీ కెవిన్ వూంగ్ తీవ్ర విమర్శలు చేశారు.అన్ని మతాలను గౌరవించడం అనేది కెనడా కల్పించిన హక్కని గుర్తుచేశారు.
ఒంటారియో గురుద్వారా కౌన్సిల్ కూడా హిందూ భక్తులపై దాడులను ఖండించింది. హిందూ భక్తులపై దాడులకు సిక్కులకు సంబంధం లేన్నారు. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
కెనడాలో హిందూ దేవాలయాలపై పిచ్చి రాతలు, భక్తులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాద అనుకూల శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నాయనేది జగమెరిగిన సత్యమే. నిజ్జర్ హత్య తరవాత ఇలాంటి ఘటనలు మరింత పెరిగాయి. తాజాగా జరిగిన ఘటనతో కెనడా,భారత్ దౌత్యసంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.