ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET ) ఫలితాలు రేపు(సోమవారం) విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలి తెలిపింది. రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఏపీలో టెట్ ను, అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 21 వరకు నిర్వహించారు. ఆగస్టు మొదటివారంలోనే పరీక్షలు నిర్వహించాల్సినప్పటికీ అభ్యర్థుల కోరిక మేరకు గడువును పొడిగించి అక్టోబర్‌కు వాయిదా వేశారు.
టెట్ ఫైనల్ కీ ని పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 29న విడుదల చేసింది. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది హాజరయ్యారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది.