మధ్య కశ్మీర్ లోని శ్రీనగర్ జిల్లా పరిధిలో దారుణం జరిగింది. మార్కెట్లో ఆదివారం మధ్యాహ్నం గ్రెనేడ్ పేలడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టీఆర్సీ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లోకి ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. దీంతో 12 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
సమస్యత్మాక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.