ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 85 లక్షల మంది యూజర్ల ఖాతాలను నిషేధించింది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘన కింద ఈ చర్యలు తీసుకుంది. 16.50 లక్షల ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా, ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘించడంతో ఖాతాలను నిషేధించారు. సెప్టెంబరు నెలలోనే 85 లక్షల ఖాతాలను నిషేధించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
బల్క్ మెసేజ్లు పంపడం, మోసాలు చేయడం, డ్రగ్స్ విక్రయాలు, చట్టాలను దుర్వినియోగం చేసిన ఆరోపణలు వచ్చిన, 70 లక్షల ఖాతాలను మెటా సంస్థ నిషేధం విధించింది. ఇక ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా 2021 ఐటీ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యవహారంలో మరో 16 లక్షలకుపైగా ఖాతాలపై నిషేధం పడింది. ఆగష్టులోనూ మెటా సంస్థ 84 లక్షల ఖాతాలను నిషేధించిన సంగతి తెలిసిందే.