కేంద్ర మంత్రి సురేశ్ గోపిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.త్రిశ్సూర్ పూరం ఉత్సవాలకు కేంద్ర మంత్రి గోపి అంబులెన్సులో వచ్చారని, ఉత్సవాలకు భంగం కలించేందుకే ఆయన అలా చేశారని కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. తాజాగా కేరళ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
తను అంబులెన్సులో ఉత్సవాలకు రాలేదని కేంద్ర మంత్రి సురేశ్ గోపి స్పష్టం చేశారు. సీఎం పినరయి ఆధ్వర్యంలోని పోలీసుల దర్యాప్తులో ఏమీ తేలదని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అంబులెన్సులో పూరం ఉత్సవాలకు రావడం ఎవరైనా చూశారా? అంటూ ఆయన ప్రశ్నించారు.అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో త్రిశ్సూర్ నుంచి సురేశ్ గోపి బీజేపీ ఎంపీగా 70వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. సీపీఐ నేత సుశీల్ కుమార్‌పై ఆయన విజయం సాధించి కేరళలో బీజేపీ ఖాతా తెరిచేలా చేశారు.