‘హరహర మహదేవ శంభోశంకర’ నామస్మరణ మధ్య చార్ధామ్లలో ఒకటైన కేదార్నాథ్ ధామ్ తలుపులు మూసివేశారు. శీతాకాలంలో ప్రతీయేటా ఇలానే చేయడం అనవాయితీ. నేటి తెల్లవారుజామున 4 గంటల నుంచి కేదార్‌నాథ్‌లో మహాశివుడికి ఘనంగా పూజలు చేశారు. ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు.
ఇక నుంచి ఆరు నెలలపాటు కేదారనాథుడు ఉఖిమఠ్‌లో దర్శనం ఇవ్వనున్నారు. భయ్యా దూజ్ సందర్భంగా ఈ రోజు తలుపులు మూసివేశారు. పంచముఖి విగ్రహాన్ని సంచార విగ్రహ డోలీలో కొలువుదీర్చారు. విగ్రహం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్‌కు ఊరేగింపుగా తరలిచారు. ఈ ఏడాది 16 లక్షల మంది కేదార్నాథ్ ధామ్‌ను సందర్శించారు.
కేదార్‌నాథుడిని చివరిసారిగా దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని 10 క్వింటాళ్ళ పూలతో అలంకరించారు. గంగోత్రి ధామ్ తలుపులు శనివారం మధ్యాహ్నం మూసివేశారు. ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రిలో గంగమ్మను పూజిస్తారు.