కెనడా పార్లమెంట్ భవనం దగ్గర భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కాషాయ జెండాను ఎగురవేశారు. నవంబర్లో ‘హిందూ హెరిటేజ్ మంత్’సందర్భంగా ఓం గుర్తు ఉన్న కాషాయ పతాకాన్ని రెపరెపలాడించారు. అధిక సంఖ్యలో ఉన్న హిందూ కెనడియన్లు రాజకీయాల్లో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కెనడా రాజకీయరంగంలో హిందువుల ప్రాతినిధ్యం తగిన స్థాయిలో లేకపోవడం బాధాకరమన్నారు. విద్యావంతులు, విజయవంతమైన కమ్యూనిటీల్లో ఒకటైన హిందువులు, కెనడా సమాజం, ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నారని ప్రశంచించారు.
రాజకీయేతర రంగాల్లో హిందువుల ప్రాతినిధ్యం మెరుగ్గానే ఉందన్నారు. రాజకీయంగా మాత్రం ఆశించిన స్థాయిలో లేనందున ప్రజాస్వామ్య ప్రక్రియలో కూడా భాగం కావాలని కోరారు. గత మూడేళ్లుగా చంద్ర ఆర్య కాషాయ జెండాను ఆవిష్కరిస్తున్నారు.