భారత్ లక్ష్యం 147 పరుగులు … డ్రింక్స్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 47/5
ముంబై వాంఖడే వేదికగా న్యూజీలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో భారత్ ఆపసోపాలు పడుతుంది. విజయానికి అవసరమైన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నానా తంటాలు పడుతోంది. కివీస్ బౌలర్ల దెబ్బకు 147 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో 29 పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయి అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది.
భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులు చేయడంపై కివీస్ 28 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో భారత్ లక్ష్యంలో ఆ మేరకు తగ్గింది.
147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్, 18 పరుగులకే ముగ్గురు కీలక ఆటగాళ్ళ వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11), శుభమన్ గిల్ (1), కోహ్లీ (1)విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్(5), సర్ఫరాజ్ ఖాన్ (1) కూడా ఊసూరుమనిపించారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి క్రీజులో రిషబ్ పంత్ (17), జడేజా (3) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 100 పరుగులు అవసరం.
కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ మూడు వికెట్లు తీయగా, గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ చెరొక వికెట్ పడగొట్టారు.
ఓవర్ నైట్ స్కోరు 171/9 వద్ద మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రారంభించిన న్యూజీలండ్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో జడేజా ఐదు వికెట్లు తీయగా, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరొక వికెట్ తీశారు.