ముంబైకు చెందిన ఎన్సీపీ నేత సిద్దిఖీని చంపినట్లే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు మేసేజ్‌లు కలకలం రేపాయి. ముంబై పోలీసులకు ఈ విషయం వెల్లడించారు. పది రోజుల్లో యోగి సీఎం పదవికి రాజీనామా చేయాలని లేదంటే సిద్దిఖీ తరహాలోనే చంపేస్తామంటూ ముంబై పోలీసులకు అందిన మేసేజ్ ద్వారా తెలుస్తోంది. ఇది ఎవరు పంపారు అనే దానిపై ముంబై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా మెలిగినందుకే సిద్ధిఖీని చంపేశామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సిద్ధిఖీ తనయుడు ఎన్సీపీ నేత జీశాన్ కూడా తమ హిట్ లిస్ట్‌లో ఉన్నాడని గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ముఠా సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తిహార్ జైలు నుంచే లారెన్స్ బిష్ణోయ్ అరాచకాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు గుర్తించిన ముంబై పోలీసులు భారత్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రముఖులకు బెదిరింపులు విదేశాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.