ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ వద్ద నగదు నిల్వల వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టాక్ మార్కట్లో ట్రేడింగ్ ద్వారా లక్షల కోట్లు సంపాదించిన అపరకుబేరుడు వారెన్ బఫెట్. ఆయన వద్ద రూ.27.30 లక్షల నగదు నిల్వలు ఉన్నాయని తేలింది. బఫెట్‌కు చెందిన ట్రేడింగ్ కంపెనీ బెర్క్‌షైర్ హాథవే ఇటీవల కాలంలో యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్లను భారీగా విక్రయించింది. గత ఏడాది కాలంలో యాపిల్ కంపెనీలో షేర్లను 174 బిలియన్ డాలర్ల నుంచి 70 బిలియన్ డాలర్లకు తగ్గించుకుంది. దీని ద్వారా వారెన్ బఫెట్ వద్ద రూ.27 లక్షల కోట్లకుపైగా నగదు చేరింది.
వారెన్ బఫెట్ తన సంపదలో 90 శాతం ఛారిటీలకు దానం చేసిన సంగతి తెలిసిందే. పిల్లల కోసం పది శాతం సంపద ఉంచుకుని మిగిలిన డబ్బు మొత్తం పేద ప్రజల ఆహారం, వైద్య, విద్య కోసం దానం చేశాడు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నెలకొల్పిన గేట్స్ మిలిందా ఫౌండేషన్‌కు లక్షల కోట్లు దానం చేసి మంచి మనసు చాటుకున్నాడు. ఆఫ్రికాలోని పేద దేశాల్లో ఈ సంస్థ ఏటా వేల కోట్లు ఖర్చు చేసి చిన్నారులకు పౌష్టికాహారం, మందులు అందిస్తోంది.