శ్రీకాళహస్తి ఈవోగా డిప్యూటీ కలెక్టర్ బాపిరెడ్డి
టీటీడీ కొత్త పాలక మండలిలో మరో సభ్యుడికి అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీజేపీ ముఖ్య నేతగా ఉన్న భానుప్రకాశ్‌రెడ్డికి పాలక మండలి సభ్యుడిగా అవకాశం కల్పించింది.
టీటీడీ చైర్మన్‌గా TV5 చైర్మన్ బీఆర్ నాయుడిని నియమించిన ప్రభుత్వం, 24 మంది సభ్యులతో కూడిన పాలక మండలిని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. తాజాగా భానుప్రకాశ్ రెడ్డి పేరును చేర్చడంతో పాలకమండలి సభ్యుల సంఖ్య 25కి చేరింది. తిరుమల తిరుపతి పాలకమండలిలో ఎక్స్అఫిషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవో ఉంటారు.
తిరుపతి జిల్లాలోని మరో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా బాపిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న బాపిరెడ్డిని డిప్యూటేషన్‌పై ఈవోగా బదిలీ చేసింది.