తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల చిన్నారి ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని ఈ గ్రామంలో మూడున్నరేళ్ల బాలికకు, చాకెట్లు ఆశ చూపి, సమీప బంధువైన సుశాంత్ బయటకు తీసుకెళ్లాడు. చాకెట్లు కొనిచ్చి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, అక్కడే చంపి పూడ్చిపెట్టినట్లు పోలీసులు చెప్పారు. రాత్రి బాగా పొద్దుపోయినా చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వడమాలపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనుమానితుడు సుశాంత్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అరాచకం వెలుగులోకి వచ్చింది. బాధితుడుని తీసుకెళ్లి చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పలు సెక్షన్ల కింద సుశాంత్‌పై కేసు నమోదు చేసినట్లు వడమాలపేట పోలీసులు తెలిపారు.