కాలిన్స్ డిక్షనరీ ‘వర్డ్ ఆఫ్ ది -2024’గా కొత్త పదం ‘బ్రాట్’ (Brat) కు చోటుదక్కింది. యూకేకి చెందిన గాయని, పాటల రచయిత చార్లీ ఎక్స్‌సీఎక్స్ ఈ పదాన్ని ఉపయోగించారు. ‘బ్రాట్’ అనే పదం సింగర్ చార్లీ విడుదల చేసిన ఆరో ఆల్బమ్ పేరు. విశ్వాసం, స్వతంత్రత, సుఖాలు కోరుకునే వైఖరి అనే అర్థాలను ఇస్తుందని కాలిన్స్ డిక్షనరీ పేర్కొంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ మద్దతుదారులు ఈ పదాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారని, దీంతో ‘బ్రాట్’ పదాన్ని కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.
యూకేకి చెందిన 32 ఏళ్ల పాప్ సింగర్ చార్లీ ఎక్స్‌సీఎక్స్ అసలు పేరు షార్లెట్ ఎమ్మా ఐచిసన్. ‘‘ఒక సాధారణ ఆకతాయి అమ్మాయి కొంచెం తలతిక్కగా, పార్టీలను ఇష్టపడే వ్యక్తి అని ఆమె ‘బ్రాట్’ అనే పదం గురించి ఆమె వివరించారు. తమని తాము తెలివి తక్కువ వాళ్లమని భావించే వ్యక్తులు అని కూడా అర్థం వస్తుందని తెలిపారు. అయితే ఆ తర్వాత ఆ వైఖరి మారవచ్చు అని కూడా అన్నారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను ‘బ్రాట్’ అని పేర్కొంటూ షార్లెట్ ఎమ్మా ,
ఈ ఏడాది జులైలోట్వీట్ చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో కమలాను ప్రమోట్ చేయడంలో భాగంగా తన ఆల్బమ్‌లోని ‘365’ పాటను ఉపయోగించి ‘కమల ఈజ్ బ్రాట్’ పేరిట ఓ టిక్ టాక్ వీడియో విడుదల చేసింది.