235 పరుగులకు న్యూజీలాండ్ ఆలౌట్
న్యూజీలాండ్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు భారత బౌలర్లు రాణించారు. రవీంద్ర జడేజా తొలి రోజు ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. భారత టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఒకే ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయడం ఇది 14వ సారి కాగా, ఇప్పటివరకు జడేజా 314 వికెట్లు పడగొట్టాడు.
తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా స్పిన్నర్లు దెబ్బకు న్యూజీలాండ్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ జట్టు 65.4 ఓవర్లు ఆడి పది వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. తొమ్మిది వికెట్లు స్పిన్నర్లే తీయడం విశేషం. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా,ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు . కానీ లక్ష్య ఛేదనలో భారత్ మరోమారు తడబాటుకు గురైంది. తొలిరోజు 19 ఓవర్లు ఆడి నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్ విధించిన లక్ష్యాన్ని అందుకునేందుకు 149 పరుగులు చేయాల్సి ఉంది.
కివీస్ తొలి ఇన్నింగ్స్ లో విధించిన 235పరుగుల ఛేదనలో 25 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. రోహిత్ శర్మ 18 బంతుల్లో 18 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 78 పరుగుల వద్ద జైస్వాల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అజాజ్ పటేల్ బౌలింగ్ లో జైస్వాల్ (30) బౌల్డ్ అయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సిరాజ్ , అజాజ్ పటేల్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఒక్క పరుగు చేసి రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 84 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయి కష్టాలో పడింది. తొలిరోజు ఆట నిలిచిపోయే సమయానికి శుభమన్ గిల్(31 ),రిషబ్ పంత్(1) క్రీజులో ఉన్నారు.
న్యూజీలాండ్ ఇన్నింగ్స్…
కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ (28) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. డేవోన్ కాన్వే (4)ను ఆకాశ్ దీప్ పెవిలియన్ కు పంపగా విల్ యంగ్ (71)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు . రచిన్ రవీంద్ర(5 ) , డారిల్ మిచైల్ ( 82) ను సుందర్ వెనక్కి పంపాడు. జడేజా బౌలింగ్ లోనే టామ్ బ్లండెల్ డకౌట్ అవ్వగా, గ్లెన్ ఫిలిప్స్ (17)బౌల్డ్ అయ్యాడు.
ఐష్ సోది (7), మ్యాట్ హెన్రీ(0), అజాజ్ పటేల్ (7), విలియమ్ ఒరోర్కీ (1*) విఫలమయ్యారు.