ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు సంక్రాంతి లోపు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల హామీలో పేర్కొన్న మేరకు సామాజిక పింఛన్ల పెంపు చేపట్టడంతో పాటు ఉచిత గ్యాస్ సిలీండర్లు పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్నికల వాగ్దానం మేరకు మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చామన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ‘‘తల్లికి, సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్కు తమ ప్రభుత్వంపై పోరాడే నైతిక హక్కు లేదని’’ దెప్పిపొడిచారు. ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలు జగన్ మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు.