సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర గృహమంత్రి దక్షతా పదక్ అవార్డులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. దర్యాప్తు, ఫొరెన్సిక్ సైన్స్, ప్రత్యేక ఆపరేషన్లు తదితర విభాగాలలో మెరుగ్గా విధులు నిర్వహించిన సిబ్బందికి ఈ అవార్డులు అందజేస్తున్నారు.
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 463 మంది పోలీస్ సిబ్బందికి ఈ అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాలు సహా అస్సాం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.
ధిల్లీ, జమ్మూకశ్మీర్, చండీగఢ్ తదితర కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలీసులతో పాటు సీబీఐ, సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ, ఎన్సీపీ, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బందిని కూడా ఈ విశేష పురస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎస్పీలు, తెలంగాణ నుంచి ఒక ఎస్పీ సహా పలువురు పోలీస్ కానిస్టేబుళ్లకు ఈ అవార్డులు లభించాయి.