భారత్, న్యూజీలాండ్ మధ్య మూడో టెస్ట్ జరుగుతోంది. టాస్ నెగ్గిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్కోర్ బోర్డు 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు న్యూజీలాండ్ తొలి వికెట్ నష్టపోయింది.
డేవన్ కాన్వే (4), ఆకాశ్ దీప్ వేసిన 3.2 బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్( 18), విల్ యంగ్ (3 ) ఉన్నారు. 8.1 ఓవర్లకు 28 పరుగులు చేసింది. సిరాజ్, ఆకాశ్ దీప్, అశ్విన్ బౌలింగ్ వేస్తున్నారు.
ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్న న్యూజీలాండ్, క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆడుతోంది. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జాబితాలో చోటు సుస్థిరం చేసుకునేందుకు భారత్ పోరాడుతోంది.
భారత స్టార్ పేసర్ బుమ్రాకి మేనేజ్మెంట్ విశ్రాంతి ఇవ్వగా పేస్ విభాగంలో సిరాజ్, ఆకాశ్ దీప్ కీలకంగా మారారు. న్యూజీలాండ్ జట్టులో సౌథీకి బదులు హెన్రీ.. శాంట్నర్ స్థానంలో ఐష్ సోధికి అవకాశం దొరికింది.
భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, సిరాజ్
న్యూజీలాండ్ జట్టు: టామ్ లేథమ్ (కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఒరోర్కీ