Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనైనా రాజీ ప్రసక్తే లేదు: మోదీ

Phaneendra by Phaneendra
Oct 31, 2024, 06:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వర్తమాన భారతదేశం తన సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలోనైనా రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. మన సైనికుల పట్టుదలను దేశ ప్రజలందరూ నమ్ముతున్నారని చెప్పారు.

‘‘ఇవాళ మన దేశం సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనైనా రాజీ పడబోదు. అందుకే, మనవిధానాలను మన సైనిక బలగాల నిర్ణయాలకు అనుగుణంగా ఉండేలా చేసాం. మనకు మన సైనికుల పట్టుదలపై పూర్తి నమ్మకం ఉంది, మన శత్రువుల మాటల మీద కాదు’’ అని  మోదీ చెప్పారు. ఆయన గుజరాత్‌లోని కఛ్ వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.  

‘‘మాతృభూమికి సేవ చేయగలగడం గొప్ప అవకాశం. మీ కృతనిశ్చయాన్ని, దృఢసంకల్పాన్నీ, అచంచల ధైర్యాన్ని, అసమాన సాహసాన్ని చూసినప్పుడు మన ప్రజలు మన దేశం సురక్షితంగా, ప్రశాంతంగా ఉందని భావిస్తున్నారు. ప్రపంచదేశాల ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు భారతదేశం శక్తిని చూస్తున్నారు. శత్రువులు మిమ్మల్ని చూసినప్పుడు వారి దుర్మార్గపు ప్రణాళికల అంతాన్ని చూస్తున్నారు. మీరు చేసే సింహగర్జనలు విని ఉగ్రవాద నేతలు సైతం భయంతో గజగజ వణికిపోతారు’’ అంటూ మోదీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.  

భారత్ ఇవాళ దేశీయంగా ఆయుధ వ్యవస్థలను నిర్మించుకోవడం ద్వారా ఆత్మనిర్భర భారతంపై ప్రజల్లో సానుకూల విశ్వాసం కలిగిందని వివరించారు. ‘‘ఇవాళ భారత్ తన సొంత జలాంతర్గామిని నిర్మించుకుంటోంది. ఇవాళ మన తేజస్ ఫైటర్ ప్లేన్ మన వైమానిక దళానికి బలంగా నిలుస్తోంది. గతంలో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా మాత్రమే తెలుసు. ఇవాళ భారతదేశం రక్షణరంగ పరికరాలను ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేస్తోంది’’ అని మోదీ చెప్పుకొచ్చారు.

‘‘21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మనం మన సైన్యాలను, మన రక్షణ బలగాలను ఆధునిక ఆయుధ సంపత్తితో సన్నద్ధం చేస్తున్నాం. ప్రపంచంలోని అత్యాధునిక సైనిక బలగాల సరసన మన సైన్యాన్ని కూడా నిలబెడుతున్నాం. మా ఈ ప్రయత్నాలకు ఆధారం రక్షణ రంగంలో మనం సాధిస్తున్న స్వయంసమృద్ధే’’ అని ప్రధాని వివరించారు.

దేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం భద్రతాబలగాలు చేస్తున్న కఠోర శ్రమను, త్యాగాలనూ ప్రధాని ప్రశంసించారు. ‘‘మన దేశం ఒక సజీవ చైతన్యం. దాన్ని మనం భారతమాత అని పూజిస్తాం. మన సైనికుల కఠోర పరిశ్రమ, త్యాగాల కారణంగానే మన దేశం, మన ప్రజలు ఇవాళ సురక్షితంగా ఉన్నారు. సురక్షితమైన దేశం మాత్రమే పురోగతి సాధించగలదు. ఇవాళ మనం వికసిత భారతం దిశగా వడివడిగా ప్రయాణిస్తున్నాం. మీరంతా ఆ స్వప్నాన్ని రక్షిస్తున్నారు’’ అని మోదీ చెప్పుకొచ్చారు. ‘‘ఇవాళ మన దేశ ప్రజలందరూ దేశాభివృద్ధి కోసం తమవంతు పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. దానికి కారణం వారికి మీమీద పూర్తి విశ్వాసం ఉండడమే. భారతీయుల నమ్మకాన్ని మీ ధైర్యసాహసాలు మరింత బలపరుస్తూనే కొనసాగుతాయని నా ప్రగాఢ విశ్వాసం’’ అన్నారు మోదీ.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ గుజరాత్ కఛ్‌ ప్రాంతంలోని సర్‌క్రీక్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.

అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి, జాతీయ ఐక్యతా దినం సందర్భంగా కేవడియాలోని ఐక్యతా ప్రతిమ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. వైమానిక దళం నిర్వహించిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం నిర్వహించిన ఎయిర్‌షోకు హాజరయ్యారు.

Tags: andhra today newsBorder Security ForceDeepawaliDiwali CelebrationsGujaratIndian Air ForceIndian ArmyIndian NavyKachchhPM Narendra ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.