దీపావళి పర్వదినం సందర్భంగా త్వరలో రాబోయే ‘జై హనుమాన్’ సినిమా థీమ్‌సాంగ్ విడుదల అయింది. ఆ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ‘కాంతార’ నాయకుడు రిషభ్ శెట్టి నటిస్తున్నారు.
విభిన్న చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ భారతీయ పురాణేతిహాసాలు ఇతివృత్తాలుగా ఒక సినిమాటిక్ యూనివర్స్ నిర్మించాలని తలపెట్టారు. అందులో భాగంగా మొదట నిర్మించిన చిత్రం ‘హను-మాన్’. తేజ సజ్జా, అమృతా అయ్యర్ తదితరులు నటించిన ఆ సినిమా ఈ యేడాది జనవరి నెలలో విడుదలైంది. చిన్నచిత్రంగా రూపొందినా, అనూహ్యమైన ప్రజాదరణ సాధించింది. దాంతో ఆ చిత్రం కొనసాగింపు భాగం మీద అమితమైన ఆసక్తి నెలకొంది.
హను-మాన్ చిత్రంలో మానవుల మధ్య జరిగే కథ కావడంతో హనుమంతుణ్ణి గ్రాఫిక్స్‌లో చూపించారు. అయితే రెండో భాగంలో హనుమంతుడిదే కీలకపాత్ర. దాంతో ఆ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఉత్కంఠకరంగా నిలిచింది. దానికి ‘కాంతార’ ఫేమ్ రిషభ్ శెట్టిని ఎంచుకున్నారు. ఇవాళ విడుదల చేసిన థీమ్‌సాంగ్‌లో ఆ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దాంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు