బంగారం ధర భారీగా పెరిగింది. దేశీయ మార్కెట్ లో తొలిసారి పది గ్రాముల బంగారం ధర రూ. 82 వేల మార్క్ కు చేరుకుంది. మంగళవారంతో ముగింపుతో పోల్చితే బుధవారం ఏకంగా రూ.1000 పెరిగి రూ.82,400కు చేరుకుంది. దీపావళి సందర్భంగా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ కూడా ధర పెరుగుదలకు కారణమని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 81,160గా ఉంది. 22 క్యారెట్ల బంగారం కోసం రూ. 74,400 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఏడు ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో పది గ్రాముల బంగారం ధర రూ. 61,200గా ఉంది. అంటే ఈసారి ఏకంగా 35 శాతం (రూ.21,200) పెరిగింది.
వెండి ధరలు కూడా పెరిగాయి. కిలోగ్రాము వెండిపై ఒక్క రోజే రూ. 1,300 పెరిగి రూ. 1.01 లక్షలకు చేరింది. గతేడాది ఇదే నెలలో కిలో వెండి ధర రూ. 74 వేలుగా ఉంది.
నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 81,330గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 74,550గా ఉంది. 18 క్యారెట్ల బంగారం పది ధర రూ.61,000గా నమోదైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.