ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్,అప్ఘనిస్తాన్ లోని హిందువులకు ఆయన తన ట్వీట్ లో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సనాతన ధర్మం ఆచరించే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన పవన్, బంగ్లాదేశ్‌లోని హిందువులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిలో శ్రీరాముడు మీకు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని ట్వీట్ లో పేర్కొన్నారు. భారత్ లో మేమంతా మీ భద్రత కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు.
దీపావళి రోజున బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో హింసకు గురవుతున్న హిందువుల భద్రత కోసం అందరం ప్రార్థిద్దాం అని కోరారు. వారి నేలలో ధర్మం పునరుద్ధరించబడాలని కోరుకుందామని వివరించారు.
సింధి భాషలో ఓ బాలుడు పాడుతున్న పాట తాలూకు వీడియోను జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్‌కు జోడించి షేర్ చేశారు. భారత్ నుంచి విడిపోయి బాధ పడుతున్నామనేది ఆ బాలుడు పాడిన పాట తాలూకా ఆవేదన . పాకిస్తాన్ లో హిందువులు ఎంత బాధను అనుభవిస్తున్నారో ఆ పాట తెలియజేస్తోందన్నారు.