తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా టీవీ5 మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా మరో 24 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తన నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అరాచకాలు జరిగాయని బీఆర్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్ననాటి నుంచి తిరుపతి, తిరుమలతో తనకు అనుబంధముందన్నారు. తిరుమలలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుమల తిరుపతి బోర్డులో పలువురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కొవ్వూర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి, పలువురు జనసేన నేతలు, బీజేపీ నేతలకు కూడా బోర్డులో చోటు దక్కింది.