విజన్ డాక్యుమెంట్ -2047కు సంబంధించిన అంశాలపై నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ భేటీలో నీతి ఆయోగ్సలహాదారు, డైరెక్టర్లతోపాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతో పాటు ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ప్రణాళిక రూపొందించినట్లు ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.
2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ అభివృద్ధే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రూపొందించినట్లు వివరించారు.
పేదరిక నిర్మూలన, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజిమెంట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి గ్రోత్ ఇంజిన్లతో వృద్ధిరేటు సాధించేలా ఈ ప్రణాళికలు రూపొందాయన్నారు.