మహారాష్ట్రలోని నవీముంబైలో దీపావళి వేడుకల సందర్భంగా దీపాలు వెలిగించుకుందామనుకున్న హిందూ మహిళలను ముస్లింలు దుర్భాషలాడి బెదిరించారు. ఆ సంఘటన తలోజా సెక్టార్ 9లో మంగళవారం చోటు చేసుకుంది.
నవీముంబైలోని పంచానంద్ సొసైటీ అనే గృహ సముదాయంలో కొందరు మహిళలు మంగళవారం రాత్రి ధనత్రయోదశి సందర్భంగా దీపాలు వెలిగించుకుంటుండగా ఓ ముస్లిం వ్యక్తి అరుపులు, కేకలు పెడుతూ విరుచుకుపడ్డాడు. సొసైటీలో దీపాలు వెలిగించడానికి వీల్లేదంటూ బెదిరించాడు. భవనం చుట్టూ ఆవరణ బహిరంగ ప్రదేశం కాబట్టి అక్కడ ఎక్కడా దీపాలు పెట్టడానికి కుదరదంటూ రెచ్చిపోయాడు. హిందూ మహిళలను అసభ్యంగా దూషిస్తూ తీవ్రంగా బెదిరించాడు.
దీపావళి పండుగ వేళ దీపాలు పెట్టుకోవడం కుదరదంటూ ముస్లిం వ్యక్తి బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. ‘‘సొసైటీలో దీపాలు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు. నేను ఇక్కడే ఉంటాను, ఒక్క దీపం కూడా పెట్టనివ్వను’’ అంటూ ఆ వ్యక్తి అరుపులు, కేకలతో ఆడవాళ్ళని బెదిరించాడు. కొన్నిక్షణాల్లోనే అతనికి మద్దతుగా మరికొందరు ముస్లిం వ్యక్తులు అక్కడకు వచ్చి, ఆడవాళ్ళను దీపాలు పెట్టకుండా అడ్డుకున్నారు. ఆ సంఘటన అంతటినీ వీడియో తీస్తున్న మహిళను వారు బెదిరించడం కూడా అదే వీడియోలో రికార్డ్ అయింది.
ఈ సంఘటనకు ముస్లిములు చెబుతున్న కారణం నాలుగు నెలల క్రితం జరిగిన సంఘటన. జూన్ నెలలో బక్రీద్ పండుగ వచ్చినప్పుడు అదే సొసైటీలో మేకలను తీసుకొచ్చి కోసారు. అలా చేయవద్దంటూ సొసైటీలోని హిందూ కుటుంబాలు అభ్యంతరపెట్టాయి. దాన్ని సాకుగా చూపిస్తూ ఇప్పుడు దీపాలు పెట్టనివ్వమంటూ ముస్లిములు ఘర్షణ పడ్డారు. పండుగ సందర్భంగా దీపాలు వెలిగించడాన్ని, బక్రీద్ వేళ మేకలను బహిరంగంగా నరకడంతో సమానంగా పోలుస్తూ గొడవకు దిగారు.