దీపావళి పండుగను దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న జరుపుకోనుండగా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లలో నవంబర్ ఒకటిన జరుపుకోనున్నారు. పండుగను నవంబర్ 1న జరుపుకోవాలని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉత్తర్వులు పేర్కొంది. దీంతో ఉత్తరాఖండ్ అంతటా నవంబర్ ఒకటిన దీపాల పండుగ జరుపుకోనున్నారు.
ఈసారి అమావాస్య రెండు రోజుల పాటు వచ్చిందని, ప్రదోష కాలం తరువాత కూడా అమావాస్య ఉంటుందని బద్రీనాథ్ ధామ్‌కు చెందిన పండితుడు రాధా కృష్ణ తప్లియాల్ తెలిపారు. నవంబర్ ఒకటిన మహాలక్ష్మి పూజ చేయాల్సి ఉండగా దీపావళి పండుగను కూడా అదే రోజు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
దేశవ్యాప్తంగా వెలువడిన 250 పంచాంగాలలో 180 పంచాంగాలు నవంబర్ ఒకటిన దీపావళిని వచ్చిందని జ్యోతిష్య నిపుణులు తెలిపారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం , నవంబర్ 1న దీపావళి అధికారిక సెలవుదినంగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.