దిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ను ఏపీ ఎన్డీయే ప్రభుత్వం మొదలుపెట్టింది. ‘రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఏపీ భవన్’ పేరిట 11.53 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణం కోసం డిజైన్లకు టెండర్లను ఆహ్వానించింది.
‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని నోటిఫికేషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ 28 లోపు ప్రతిపాదనలు సమర్పించాలని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత దిల్లీలోని ఏపీ భవన్‌ను రెండుగా విభజించారు. ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల అధికారులు చర్చించి ఏపీ భవన్ విభజనను ఖరారు చేశారు. ప్రస్తుతం ఉన్న భవనాలను తెలుగు రాష్ట్రాలు కలిసి వినియోగించుకుంటున్నాయి.