హిందీ సినీనటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. మహమ్మద్ తయ్యబ్ 20ఏళ్ళ యువకుడు. సల్మాన్‌ఖాన్‌తో పాటు ఇటీవల హత్యకు గురైన ఎన్‌సిపి నేత బాబా సిద్దికీ కొడుకు జీషన్ సిద్దికీని చంపేస్తామంటూ బెదిరించాడు. అతన్ని ముంబై పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసారు.
అక్టోబర్ 25న జీషన్ సిద్దికీ కార్యాలయం ఫోన్‌నెంబర్‌కు కొన్ని మెసేజ్‌లు వెళ్ళాయి. తాము కోరినంత డబ్బును చెల్లించకపోతే జీషన్‌ను, సల్మాన్‌ఖాన్‌నూ చంపేస్తామంటూ తయ్యబ్ ఆ సందేశాల్లో పేర్కొన్నాడు. ఆ బెదిరింపు సందేశాలపై బాంద్రా పీఎస్‌లో ఫిర్యాదు నమోదు చేసారు. దాని ఆధారంగా నిందితుడు మహమ్మద్ తయ్యబ్ మీద కేసు రిజిస్టర్ అయింది.
పోలీసులు నిందితుడి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇవాళ నోయిడా సెక్టార్ 39లో తయ్యబ్ పట్టుబడ్డాడు. అక్కడినుంచి ట్రాన్సిట్ రిమాండ్ మీద ముంబైకి తీసుకొచ్చారు. మహమ్మద్ తయ్యబ్‌కు ఎలాంటి గ్యాంగ్‌లతో కానీ, మాఫియాతో కానీ ఎలాంటి సంబంధాలూ లేవని పోలీసులు చెప్పారు.