ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులకు ఇబ్బందులు పెరిగాయి. విదేశీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన ఫుడ్ బ్యాంకుల సేవలపై కోత పెట్టాలని ట్రూడో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే విదేశీ విద్యార్థులకు ఆహార కష్టాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
ఆహార పదార్థాల ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య కారణంగా మొదటి ఏడాది విద్యార్థులకు ఈ సౌలభ్యం కల్పించకూడదని వాంకోవర్‌లోని ఫుడ్‌బ్యాంక్ నిర్ణయించింది.
కెనడాలో ఫుడ్ బ్యాంకులపై ఆధారపడుతున్న వారి సంఖ్య ప్రతీఏడు పెరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో 20 లక్షల మంది విద్యార్థులు ఫుడ్ బ్యాంకులను ఆశ్రయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ. ఐదేళ్ళకిందట నాటితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు అయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఉన్నత చదువుల కోసం కెనడా వచ్చే విదేశీ విద్యార్థుల జీవన వ్యయం పరిమితిని ప్రభుత్వం ఇప్పటికే రెట్టింపు చేసింది. గతంలో ఇది 10 వేల డాలర్లుగా ఉండగా ప్రస్తుతం రెట్టింపు అయింది.