ముష్కరుల కాల్పుల్లో గాయపడిన ఆర్మీ శునకం ఫౌంటమ్ మృతి
జమ్మూ పరిధిలోని అఖ్నూర్ సెక్టార్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య బుల్లెట్ ఫైట్ జరిగింది. నేటి తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. సోమవారం రాత్రి ఓ మిలిటెంట్ చనిపోయాడు.
ఆర్మీ కాన్వాయ్‌పై సోమవారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఆ వెంటనే భద్రతా దళాలు కూంబింగ్ కి దిగాయి. భద్రతా దళాలు, ఎన్ఎస్జీ కమాండోలు చేపట్టిన ఆపరేషన్‌లో తొలుత ఓ ఉగ్రవాది చనిపోయాడు. నేడు ఇద్దరు చనిపోయారు.
ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భారత ఆర్మీకి చెందిన శునకం ‘ఫాంటమ్’ ప్రాణాలు కోల్పోయింది. ఫాంటమ్ బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందినది. 2020, మే 25న జన్మించిన ఫౌంటమ్ , పలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంది. దీనిని మీరట్‌లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ నుంచి తీసుకొచ్చారు. ఈ శునకం 2022, ఆగస్ట్ 12 నుంచి అసాల్ట్ డాగ్ యూనిట్‌లో సేవలు అందిస్తోంది.