అరాచకశక్తులు పేట్రోగిపోతున్నాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆపకపోతే చంపేస్తామంటూ ఉత్తరప్రదేశ్లోని మధురకు చెందిన పదేళ్ల అభినవ్ అరోరాకు బెదిరింపులు వచ్చాయని అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్సీపీ నేత సిద్ధికీ హత్య తమ పనేనని చెప్పుకుంటోన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆదివారం రాత్రి ఒక మిస్డ్ కాల్ వచ్చిందని, తరవాత ఉదయం మరో సారి ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరించారంటూ అభినవ్ అరోరా తల్లి జ్యోతి అరోరా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అభినవ్ అరోరా మూడేళ్ల వయసు నుంచే ఆధ్యాత్మిక బాట పట్టారు. ఆయన ప్రసంగాలు వినడానికి వేలాది మంది వస్తుంటారు. పదేళ్ల అభినవ్ అరోరా హిందూ ధర్మాన్మి ప్రచారం చేయడం తప్ప అతను చేసిన తప్పేమీ లేదని ఆయన తల్లి జ్యోతి అరోరా వాపోయారు.సోషల్ మీడియా ద్వారా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడమే అరోరా చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
అభినవ్ అరోరాను స్వామి రాంభద్రాచార్య తిట్టినట్లు వస్తున్న వార్తలను అతని తల్లి ఖండించారు. పెద్దల తిట్లు కూడా ఆశీర్వచనాలేనంటూ పేర్కొంది. అభినవ్ ఢిల్లీ వేదికంగా సోషల్ మీడియాలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను పొందాడు. అతని ఎదుగుదల చూడలేకే కొందరు బెదిరింపులకు దిగుతున్నారని జ్యోతి అరోరా ఆందోళన వ్యక్తం చేశారు.