ఉద్యోగాల భర్తీకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. 2024 – 25 ఆర్ధిక సంవత్సరంలోనే ఈ పోస్టులు భర్తీ చేయాలని యూనియన్ బ్యాంక్ (యూబీఐ) నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 400 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు 200, తెలంగాణకు 200 పోస్టులను కేటాయించింది.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభంకానుంనది. అర్హులు, నవంబర్ 13 వరకూ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ అర్హత తప్పనసరి. అలాగే 20 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు వయసులో ఐదేళ్ల సడలింపు ఉండగా, ఓబీసీ కేటగిరికి 3, జనరల్ పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు పది సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుం కింద జనరల్ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూడీ అభ్యర్ధులు మాత్రం కేవలం రూ.175లు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపికైన వారికి జీతం నెలకు రూ.48,480ల నుంచి రూ.85,920ల వరకు ఉంటుంది. ముందుగా రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులై అర్హత సాధించిన వారికి నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు.
మరిన్ని వివరాలు https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx వెబ్ సైట్ లో పొందుపరిచారు.