ఆస్ట్రేలియాలో రెండు హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసారు. దేవాలయాలను ధ్వంసం చేసి హుండీలను దోచుకున్నారు. శివలింగాన్ని పగలగొట్టడం ద్వారా వారి చర్య కేవలం దొంగతనం కాదనీ, హిందువుల విశ్వాసాలను దెబ్బతీయడమే వారి అసలు లక్ష్యమనీ అర్ధమవుతోంది.
కాన్‌బెర్రాలోని ఫ్లోరే ప్రాంతంలోని హిందూ దేవాలయంలోకి నలుగురు వ్యక్తులు వ్యాన్‌తో సహా దూసుకువెళ్లారు. నాలుగు హుండీలను దొంగతనం చేసారు. వార్షిక దీపావళి మేళా జరిగిన కొద్దిసేపటికే ఆ దాడి జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు తరుణ్ అగస్తి మాట్లాడుతూ ‘‘ఇదొక మతిమాలిన చర్య. మా సమాజానికి చెందిన ప్రార్థనాస్థలాన్ని అగౌరవపరచడం మమ్మల్ని కలచివేసింది. మేం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నాం. ఈ సంఘటన గురించి దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని కోరుతున్నాం. ఇలాంటి ధ్వంస చర్యలు హిందూ సమాజాన్ని మాత్రమే ప్రభావితం చేయవు, కాన్‌బెర్రాలోని వైవిధ్యభరితమైన సమాజపు గౌరవం, సహనం, సమగ్రత వంటి విలువలనే దెబ్బతీస్తున్నయి’’ అన్నారు.
ఆ తర్వాత అతివాదులు కాన్‌బెర్రాలోని శ్రీ విష్ణు శివ మందిరానికి వెళ్ళారు. అక్కడ హుండీలను పగలగొట్టి ఎత్తుకుపోయారు. శివలింగాన్ని పగలగొట్టారు, గర్భగుడిలోని కప్‌బోర్డ్‌ను, వసంత మండపాన్ని ధ్వంసం చేసారు. ఆ సంఘటనపై స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేసారు. దేవాలయాల భద్రత, హిందువుల రక్షణకు సహకారం అందించాలంటూ ఆలయ కమిటీ అధ్యక్షుడు థమో శ్రీతరం, కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రభుత్వాన్ని కోరారు.