ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ చంద్రధనశేఖర్ తూట,జస్టిస్ గుణరంజన్ చల్లా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త న్యాయమూర్తుల రాకతో కేసుల్లో వేగం పెరుగుతుందని ఆశిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా హైకోర్టులో జడ్జిల నియామకం వేగంగా సాగుతోంది. లక్షలాది కేసులు పెండింగులో ఉండటంతో కేంద్ర న్యాయశాఖ జడ్జిల నియామకం చేపట్టింది. దేశ వ్యాప్తంగా 5 కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయి. వాటి పరిష్కారానికి కొత్త కోర్టులు ఏర్పాటు చేయడంతోపాటు, జడ్జిల నియామకం చేపట్టాలని కేంద్ర న్యాయశాఖ నిర్ణయించింది.