Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

ముడి ఇనుము అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ళ జైలుశిక్ష

Phaneendra by Phaneendra
Oct 27, 2024, 09:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కర్ణాటకలోని కార్వార్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్‌ సెయిల్‌కు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది.  బెలెకెరి రేవు నుంచి ముడి ఇనుము అక్రమ రవాణా చేస్తున్నాడన్న ఆరోపణలు నిరూపణ అవడంతో కోర్టు ఎమ్మెల్యేకు ఈ శిక్ష విధించింది. ఎమ్మెల్యే మీద అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులున్నాయి. వాటిలో ఒక కేసులో ఈ శిక్ష పడింది. మిగతా కేసులకు సంబంధించి వేర్వేరు శిక్షలు, జరిమానాలు విధించింది. అవన్నీ కలుపుకుంటే కుట్రకు ఐదేళ్ళు, మోసానికి ఏడేళ్ళు, దొంగతనానికి మూడేళ్ళు శిక్షలు పడ్డాయి.

సతీష్ మీదున్న కేసుల విచారణ అక్టోబర్ 24న పూర్తయింది. ఆ విచారణలో ఆయన దోషి అని తేలింది. వాటికి సంబంధించి శిక్షలను న్యాయస్థానం శనివారం నాడు ఖరారు చేసింది. మొత్తం ఆరు కేసులకూ కలిపి పైన చెప్పిన జైలుశిక్షలకు అదనంగా రూ.44కోట్లకు పైగా జరిమానా విధించింది. ఆ కేసుల్లో సతీష్‌తో సహనిందితులైన మహేషి బిలియే, ఖారపూడి మహేష్, మల్లికార్జున షిప్పింగ్ సంస్థ ప్రతినిధులకు కూడా శిక్షలు పడ్డాయి.

ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధి అయిన వ్యక్తికి రెండేళ్ళకు పైగా జైలుశిక్ష పడితే అతను ఆ పదవికి అనర్హుడవుతాడు. ఎమ్మెల్యే సీటు కోల్పోతాడు. అయితే సతీష్ ఈ కేసులో హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే, శిక్షల అమలు మీద స్టే తెచ్చుకుంటే, ఎమ్మెల్యే పదవికి అనర్హతను తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు.

ఈ కేసు మూలాలు బళ్ళారి, హోస్పేట, సండూరు, చిత్రదుర్గ అటవీ ప్రాంతాల్లో గనుల అక్రమ తవ్వకాలు, ముడి ఇనుము అక్రమ రవాణాలో ఉన్నాయి. సరైన అనుమతులు లేకుండా భారీ మొత్తాల్లో ముడి ఇనుమును అక్రమ రవాణా చేయడం ఆ ప్రాంతాల్లో సర్వసాధారణం. 2010 మార్చి 20న అటవీశాఖ రూ.350 కోట్ల విలువైన 8.5లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని స్వాధీనం చేసుకుంది. దాన్ని భద్రపరిచే బాధ్యతను రేవుల విభాగానికి అప్పగించారు. కొన్ని నెలల తర్వాత అటవీశాఖ రీ-ఇనస్పెక్షన్ చేసినప్పుడు కేవలం 2లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం మాత్రమే మిగిలుంది. దాన్నిబట్టి పోర్ట్ అధికారులకు, షిప్పింగ్ కంపెనీలకూ ఉన్న సంబంధాలు అర్ధం చేసుకోవచ్చు.

కర్ణాటక లోకాయుక్త దానిపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించింది. 2010 జూన్ 23న ఆ కేసును సిఐడికి అప్పగించారు. 2011లో సుప్రీంకోర్టు ఆ కేసును సిబిఐకి బదిలీ చేసి, 2009 నుంచి 2010 మే వరకూ జరిగిన అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా గురించి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సిబిఐ 2013 సెప్టెంబర్ 13న అధికారికంగా కేసు నమోదు చేసింది.

సిబిఐ దర్యాప్తులో గనుల అక్రమ తవ్వకాలు, అక్రమ ఎగుమతుల వ్యవహారాల నెట్‌వర్క్ బైటపడింది. అందులో చాలా కంపెనీలున్నాయి. వాటిలో ఎమ్మెల్యే సతీష్‌కు చెందిన శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది. బెలెకెరె ఓడరేవు ద్వారా 88.06 మెట్రిక్ టన్నుల ముడి ఇనుమును 73 వేర్వేరు కంపెనీలు విదేశాలకు అక్రమంగా తరలించాయని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికలో వెల్లడైంది. అందులో శ్రీమల్లికార్జున షిప్పింగ్ ఒక్క సంస్థే 7.23 లక్షల మెట్రిక్ టన్నుల ముడిఇనుమును అక్రమ రవాణా చేసిందని నిర్ధారణ అయింది.

అలా, పదేళ్ళ కంటె ఎక్కువ కాలం నుంచి జరుగుతున్న అక్రమ తవ్వకాలు, రవాణా దందా గురించి వేసిన కేసులో ఎమ్మెల్యే సతీష్ దోషి అని ప్రత్యేక న్యాయస్థానం తేల్చి చెప్పింది.

Tags: andhra today newsCBI InvestigationCongress MLAGuilty in CasesIllegal Mining and TransportImprisonment and FineIron OreKarnatakaSatish SailSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.