మహిళలపై దారుణాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యాపారవేత్త భార్యను దారుణంగా హత్య చేసి పూడ్చేసిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని కాన్నూరుకు చెందిన వ్యాపార వేత్త భార్యను జిమ్ ట్రైనర్ విమల్ సోనీ దారుణంగా హత్య చేసి కలెక్టర్ బంగ్లా సమీపంలోని క్వార్టర్స్ వెనకాల పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
నాలుగు నెలల కిందట కాన్పూరు పట్టణానికి చెందిన ఓ వ్యాపారి భార్య కనిపించకుండాపోయింది. పోలీసులు విచారణ చేపట్టినా కేసు ముందుకు సాగలేదు. తాజాగా కాన్నూరు కలెక్టర్ బంగ్లా సమీపంలోని గ్రీన్‌పార్కు వద్ద తవ్వకాల్లో ఓ శవం వెలుగు చూసింది. పోలీసులకు సమాచారం అందించారు. విచారించిన పోలీసులు 4 నెలల కిందట కనిపించకుండా పోయిన మహిళ మృతదేహంగా గుర్తించారు. లోతుగా విచారించగా కుట్ర వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ప్రతి రోజూ వెళ్లే జిమ్‌లోని ట్రైనర్
విమల్ సోనీని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు.
జిమ్ ట్రైనర్‌కు ఆ మహిళకు అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. జిమ్ ట్రైనర్‌కు వివాహం కుదిరింది. ఇది ఇష్టంలేని మహిళ అతనితో గొడవ పడిందని పోలీసులు తెలిపారు. ఆ గొడవలో జిమ్ ట్రైనర్ విమల్ సోనీ బలంగా కొట్టడంతో మహిళ చనిపోయినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని కాన్పూర్ జిల్లా కలెక్టర్ బంగ్లా సమీపంలోని గ్రీన్ పార్కులో పూడ్చి పెట్టాడు. నిందితుడు సెల్ ఫోను కూడా ఉపయోగించకపోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదని పోలీసు అధికారులు తెలిపారు. ఎట్టకేలకు నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.