భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్ళు పూర్తవునుంది.వచ్చే నవంబర్ 26 నాటికి భారత రాజ్యాంగం ఆమోదం పొంది సరిగ్గా 75 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా వచ్చే నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే ఉభయసభల సభ్యులు సమావేశం కానున్నారు.
రాజ్యాంగానికి ఆమోదం లభించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పులు, చేర్పుల గురించిన విషయాలు ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశముంది.
గతంలో నవంబర్ 26 నాడు జాతీయ న్యాయదినోత్పవంగా నిర్వహించే వారు. 2015 నుంచి అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మార్చారు.