పంజాబ్‌కు చెందిన రేచల్ గుప్తా(20) ప్రతిష్ఠాత్మక ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ గా ఘనత సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొనగా ఆమె మొదటి స్థానంలో నిలిచి కిరీటాన్ని అందుకున్నారు. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చోటు సాధించారు.
భారతదేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్‌ను గెలుచుకున్నట్టు రేచల్ తన ఇన్ స్టా అకౌంట్ పేర్కొన్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రేచల్, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించారు.
రేచల్ మరికొన్ని పోటీల్లో కూడా టైటిల్ విజేతగా నిలిచారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 విజేత హోదాలో ప్రపంచ శాంతి, స్థిరత్వంపై ప్రచారం కల్పిస్తారు.