ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. నిర్మాణాలు, లేఅవుట్ అప్రూవల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పట్టణ ప్రణాళికా విభంగా తెలిపింది. భవన నిర్మాణాలు, లే అవుట్ల ఆన్లైన్ అనుమతుల పోర్టర్లో మార్పుల కారణంగా సంబంధిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు వివరించింది. . ఈ మేరకు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఓ ప్రకటన జారీ చేశారు.
సర్వర్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్‌లో భాగంగా నవంబర్ 4 వరకూ సేవలు అందుబాటులో ఉండవని ఆమె తెలిపారు. భవన నిర్మాణాలు, లేఅవుట్ అప్రూవల్స్‌ను ఏపీడీపీఎంఎస్ వెబ్ పోర్టల్ ద్వారా జారీ చేస్తున్నారు.
ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ఉన్న పట్టణ ప్రణాళికా విభాగం డేటాను స్టేట్ డేటా సెంటర్‌కు బదలాయిస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భవన,లేఅవుట్లకు యధావిధిగా ఆన్లైన్లో అనుమతులు జారీ చేస్తామని తెలిపారు . ప్రజలు, బిల్డర్లు, డెవలపర్స్,ఇంజినీర్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.