మేడారం సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర తేదీలు ఖరారయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం లో జాతరను వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించాలని మేడారం పూజారులు నిర్ణయించారు.
మేడారం జాతర రెండేళ్లకోమారు నిర్వహిస్తారు. జాతరకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. వన దేవతలకు మొక్కులు చెల్లించి తరిస్తారు.మేడారం జాతర జరిగిన ఏడాది తర్వాత చిన్న జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
ఆనవాయతీ మేరకు సమావేశమైన మేడారం పూజారులు అటవీ ప్రాంతంలో జాతరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖను కోరుతూ తీర్మానం చేశారు.