మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లక్షలాది హిందువులు భారీ ర్యాలీ చేశారు. చటోగ్రామ్ సనాతన జాగరణ్ మంచ్ పిలుపు మేరకు లక్షల మంది హిందువులు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. తాత్కాలిక ప్రధాని యూనస్ ముందు పలు డిమాండ్లు ఉంచారు.రాజధాని ఢాకాతోపాటు చిట్టగ్రామ్‌లో లక్షలాది హిందువులు రెండో రోజు ర్యాలీలు చేశారు.హిందువుల ర్యాలీతో ఢాకాలో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.
బంగ్లాదేశ్‌లోని హిందువులు ముఖ్యంగా ఎనిమిది డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. హిందువులపై దాడులు ఆపాలని, తమ వ్యాపార సంస్థలు, హిందువుల దేవాలయాలపై దాడులు ఆగేలా చర్యలు తీసుకోవాలని యూనస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మైనారిటీలకు పార్లమెంటులో పది శాతం సీట్లు కేటాయించడంతోపాటు, మైనారిటీ హిందువులపై జరిగిన దాడుల కేసులను సత్వరం విచారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మైనారిటీ ప్రొటెక్షన్ చట్టం తీసుకురావాలని ప్రధాన డిమాండ్లలో పేర్కొన్నారు.
రిజర్వేషన్ల అల్లర్లలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల అంశంపై జరిగిన హింసలో వేలాది హిందువులపై దాడులు జరిగాయి. వారి ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేశారు. వేలాది దేవాలయాలను నాశనం చేశారు. దీనిపై బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. యూనస్ ప్రభుత్వం హిందువులకు తగిన రక్షణ కల్పించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు